AP launches new liquor policyb ఏపీ నూతన మద్యం పాలసీ విడుదల


ఏపీ నూతన మద్యం పాలసీ విడుదల అక్టోబర్ 2 నుంచి ఏపీలో నూతన మద్యం పాలసీ అమలవుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ప్రభుత్వం శుక్రవారం నూతన పాలసీని విడుదల చేసింది. ఈ ఏడాది 3500 షాపులను ప్రభుత్వం నిర్వహించనుంది. ఒక్కో దుకాణంలో పట్టణ ప్రాంతంలో అయితే ఐదుగురు, గ్రామ ప్రాంతాల్లో అయితే నలుగురిని ప్రభుత్వం నియమించనుంది. సూపర్ వైజర్ కు డిగ్రీ, సేల్స్ మ్యాన్ కు ఇంటర్ అర్హతగా నిర్ణయించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు షాపులు నిర్వహించనున్నారు. ప్రతి షాపుకు తెలుగు, ఇంగ్లీషులో నెంబర్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. సిట్టింగ్ వైన్స్ లు ఉండవని తెలుస్తోంది. కేవలం కొనుగోలు చేసి తీసుకెళ్లే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో మందు బాబులకు షాక్ తగలనుందని అంతా చర్చించుకుంటున్నారు.

Comments