ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్నిప్రమాదం
ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని మొదటి అంతస్తులో శనివారం మధ్యాహ్నం మంటలు చెలరేగడంతో రోగులు, బంధువులు ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలు అదుపుచేస్తున్నారు. ఆస్పత్రి వద్ద పొగలు వ్యాపించడంతో అంతా భయంతో పరుగులు తీశారు. ఫస్ట్ ఫ్లోర్ లో ప్రమాదం జరగగా.. రెండో అంతస్తు దాకా పొగలు వ్యాపించాయి. బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఎయిమ్స్‌లోనే చికిత్స పొందుతున్నప్పటికీ.. ఆయన వేరే భవనంలో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

Comments