వైఎస్ విగ్రహం ధ్వంసంతో తీవ్ర ఉద్రిక్తత The YS statue was furious with the destruction

వైఎస్ విగ్రహం ధ్వంసంతో తీవ్ర ఉద్రిక్తత
The YS statue was furious  with the destruction

దివంగత ముఖ్యమంత్రి, వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని కొందరు దుండగులు ధ్వంసం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ఘటన గుంటూరు సమీపంలోని కాకుమానులో నిన్న సాయంత్రం జరిగింది. ఇక్కడి చౌరస్తాలో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం చేతులు విరిచారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, వైసీపీ నేతలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు డిమాండ్‌ చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ కెమెరాలు పరిశీలించి నిందితులను గుర్తిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వైసీపీ కార్యకర్తలు కాస్తంత శాంతించారు.

Comments