ట్విటర్ వేదికగా బాలు ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. 'బాలసుబ్రహ్మణ్యం సర్. త్వరితగతిన మీరు కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడిని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు. నాకోసం ఎన్నో పాటలు పాడి నన్ను ఎంతో స్పెషల్‌గా చేసినందుకు ధన్యవాదాలు మీ దిల్ దివానా హీరో ప్రేమ్. లవ్ యూ సర్' అని పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్ నటించి సూపర్ డూపర్ హిట్ అయిన మై నే ప్యార్ కియా, సాజన్, హమ్ ఆప్కే హై కన్, అందాజ అప్నా అప్నా వంటి చిత్రాల్లో బాల సుబ్రహ్మణ్యం పలు పాటలు పాడి అలరించిన సంగతి తెలిసిందే.
Comments