పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా రూపొందిన 'సర్కారువారి పాట' కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తితో .. ఆతృతతో ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పరశురామ్ మాట్లాడుతూ .. "మీడియా మిత్రులందరికీ ముందుగా థ్యాంక్స్ చెబుతున్నాను. వారి సహకారం లేకపోతే 'సర్కారువారి పాట'కి ఈ రోజున ఇంత బజ్ వచ్చేదే కాదు. నా కెరియర్ మొదటి నుంచి కూడా నేను చిన్న సినిమా చేసినా .. పెద్ద సినిమా చేసినా మీడియా నన్ను సపోర్టు చేస్తూ వస్తున్నందుకు ఆనందంగా ఉంది.
సినిమ చాలా బాగా వచ్చింది .. సినిమా కోసం పనిచేసిన మేమంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. రైటింగ్ సైడ్ గానీ .. విజువల్స్ పరంగా గానీ .. హీరో లుక్స్ పరంగా గానీ .. మిగతా ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ గానీ .. కథను తీసుకుని వెళ్లే విధానం గాని అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి
మహేశ్ బాబు గారు నాపై నమ్మకంతో ఈ ప్రాజెక్టును అప్పగించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా వంతు ప్రయత్నం చేశాను. దాదాపు సక్సెస్ అయ్యాననే అనుకుంటున్నాను. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా మంచి అవుట్ పుట్ వచ్చింది.
రేపు అందరి నుంచి వచ్చే రెస్పాన్స్ కోసం ఎంతో మా టీమ్ అంతా వెయిట్ చేస్తోంది. మహేశ్ తో ఒక సినిమా చేయాలనేది మొదటి నుంచి కూడా నా డ్రీమ్. అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందా అనుకున్నాను. ఈ సినిమాతో నా కోరిక నెరవేరింది. డైరెక్టర్ ను ఎంత ఫర్టుగా ఉంచితే అంతమంచి అవుట్ పుట్ వస్తుందని భావించే హీరోల్లో ఆయన ఒకరు. ఈ సినిమా విషయంలో నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఉండటానికి కారణం మహేశ్ బాబుగారు ఇచ్చిన సపోర్ట్ అనే చెప్పాలి. కథ వినగానే ఆయన ఓకే చెప్పారు .. ఎలాంటి మార్పులు చేర్పులు చెప్పలేదు.
ఇది పాన్ ఇండియా స్థాయిలో చేద్దామని ముందుగా అనుకోలేదు. తెలుగు ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథ ఇది. ఈ కథలో ఎక్కడా రాజకీయాలు ఉండవు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా లైక్ చేసే లైన్ తో ముందుకు వెళుతుంది. మహేశ్ బాబు 'ఒక్కడు' సినిమా చూసిన తరువాత తప్పకుండా నేను డైరెక్టర్ ను కావాలని అనుకున్నాను.
ఇక మహేశ్ బాబు 'పోకిరి' చేసేటప్పుడు నేను పూరి గారి దగ్గర వర్క్ చేస్తున్నాను. నేను కూడా మహేశ్ బాబుగారితో ఒక సినిమా చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఆ సినిమా మహేశ్ కెరియర్లోను .. నా కెరియర్లోను చెప్పుకోదగినదిగా ఉండాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తూ వెళ్లాను. ఆ ప్రయత్నానికి ఫలితమే ఈ 'సర్కారువారి పాట' అని చెప్పుకొచ్చాడు.
Comments