telugu movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
సర్కారువారి పాట’(Sarkaru Vaari Paata) సినిమా చేస్తుంటే ‘పోకిరి’నాటి రోజులు గుర్తుకు వచ్చాయని అంటున్నారు అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు(Mahesh babu). ఆయన కీలక పాత్రలో పరశురామ్ తెరకెక్కించిన చిత్రమిది. కీర్తి సురేశ్(Keerthy Suresh) కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దిన ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అంతేకాదు, మహేశ్‌బాబు ఇందులో ఫుల్ ఎనర్జీతో నటించారని అర్థమవుతోంది.‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ ,‘100 వయాగ్రాలు వేసుకుని శోభనానికి రెడీ అయిన పెళ్లి కొడుకు గదికి వచ్చినట్లు వచ్చారు’ అంటూ డైలాగ్‌లు మహేశ్ అభిమానులతో విజిల్స్ వేయిస్తున్నాయి. బ్యాంకు రుణాలు, ఆర్థికలావాదేవీల ఇతివృత్తంగా పరశురామ్ ‘సర్కారువారి పాట’ (Sarkaru Vaari Paata)రూపొందించారు. సముద్రఖని, వెన్నెల కిషోర్, తదితరులు కీలక పాత్రలు పోషించారు. భ్రూణహత్యల నేపథ్యంలో...
Comments