Telugu News/ India News/ India Corona: 20 వేల దిగువకు చేరిన క్రియాశీల కేసులు

Telugu News/ India News/ India Corona: 20 వేల దిగువకు చేరిన క్రియాశీల కేసులు


Updated : IST India Corona: 20 వేల దిగువకు చేరిన క్రియాశీల కేసులు తగ్గిన కరోనా కొత్త కేసులు.. ఎన్నంటే..? India Corona: 20 వేల దిగువకు చేరిన క్రియాశీల కేసులు దిల్లీ: దేశంలో గత కొన్ని రోజులుగా మూడు వేలకుపైగా నమోదువుతున్న కొత్త కేసులు.. నేడు కాస్త తగ్గడం ఊరట కలిగిస్తోంది. నిన్న 4.84 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,288 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 0.47 శాతంగా ఉంది. 24 గంటల వ్యవధిలో 3,044 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మరోరోజు కొత్త కేసులు కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. దీంతో క్రియాశీల కేసులు 20 వేల లోపునకు చేరాయి. ఇక నిన్న 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ 4.31 కోట్ల మందికి కరోనా సోకగా.. అందులో 98.74 శాతం మంది వైరస్‌ను జయించారు. క్రియాశీల రేటు 0.05 శాతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ దేశంలో 5.24 లక్షల మంది మహమ్మారికి బలయ్యారని మంగళవారం కేంద్రం వెల్లడించింది. 




Comments